అమరావతి : సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించింది ప్రభుత్వం. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును పెట్టారు మంత్రి బుగ్గన. ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు…
ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్లో చిరంజీవి పోస్ట్ చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం…
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Read Also: అసెంబ్లీ సమావేశాల్లో…
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రాప్ ఆధారంగా…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కోసం ఏపీ ఖర్చు పెట్టిన రూ. 176 కోట్ల నిధులను రీ-ఇంబర్స్ చేయాలని కోరిన ఏపీ.. ఉడాన్ పథకంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని తిరిగివ్వాలని ప్రతిపాదనలు చేసింది.. ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు…
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ వల్ల పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు పరిహారం అందించనున్నారు… సంబంధిత రైతుల ఖాతాల్లో 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం…
టాలీవుడ్ లో గత కొన్ని నెలల నుంచి టికెట్ రేట్ల విషయమై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లను పెంచమంటూ సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం అలాగే నానుతోంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే గనుక టాలీవుడ్ కు భారీ నష్టం తప్పదనడంలో ఎలాంటి…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త గ్యాప్ పెరుగుతోంది.. జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాయి.. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తాం.. ఆ తరువాత సీఎస్ ను కలిసి మా భవిష్యత్…
అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు…
ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన…