ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది:సూర్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఉద్యోగులు దాచు కున్న సొమ్ము ఏడాదికి రూ. 8 నుంచి రూ. 10 కోట్ల మేర ఉంటుం దని, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడుతుందన్నారు. ప్రత్యేక అకౌంట్ పెట్టి ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు పెండింగ్‌లో పెట్టకుండా ఇచ్చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
జీపీఎప్ ఖాతాలకు జమ చేసిన డీఏ ఏరియర్స్ సొమ్మును ఉద్యోగు లకు చెప్పకుండానే వారి వ్యక్తిగత ఖాతాల నుంచి వెనక్కు తీసుకుం టున్నారన్నారు. ఉద్యోగుల ప్రమేయం లేకుండా.. వారి వ్యక్తిగత ఖాతా ల నుంచి జమ అయిన సొమ్మును ఎలా వెనక్కు తీసుకుంటా రని సూర్యనారాయణ ప్రశ్నించారు. జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బును వెనక్కు తీసుకున్న ఘటనపై విచారణ జరిపించాలన్నారు. సీఎఫ్ ఎంఎస్, ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల న్నారు. జీపీఎఫ్ ఖాతాల్లోని మా డబ్బుకు భద్రత ఉందా అనే అను మానం కలుగుతోందన్నారు. ఉద్యోగుల సమస్యలు పై ప్రభుత్వం స్పందన సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక భారం లేని అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని, సీపీఎస్ రద్దు, డీఏల చెల్లింపు, పీఆర్సీ అమలు చేస్తామన్న హామీలు పట్టించు కోవడం లేదని సూర్యనారాయణ విమర్శించారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
తాజావార్తలు
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్‌ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!