ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యిది.. పలువురు ఐఏఎస్ అధికారులు సహా ఉద్యోగులు సరిగా విధులకు హాజరు కావడం లేదని భావిస్తోన్న ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉంది.. ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించింది జీఏడీ.. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై మరోసారి మెమో జారీ చేసింది.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని అధికారులకు సూచించింది. బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించింది ప్రభుత్వం.
Read Also : గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఫోన్‌లో ప్రముఖుల ఫొటోలు..!
ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజు వారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాలని ఆదేశించింది వైఎస్ జగన్ సర్కార్.. సెక్రటేరియెట్టులోని అన్ని విభాగాల్లో 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని పేర్కొంది.. ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.. రిటైరైన, ట్రాన్సఫరైన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని సూచించింది. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో 11 దాటినా సంబంధిత అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కొత్తేమీ కాదు.. మండల, జిల్లా స్థాయిలోనే కాదు.. ఏకంగా సచివాలయంలోనూ ఇలాంటే పరిస్థితి ఉండడంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది సర్కార్.