ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాపై ఏడాది నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!