ఏపీ ఎన్జీఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో బండి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం మీదా అనేక రకాలుగా ఒత్తిడిని తీసుకువస్తు 71 డిమాండ్లు తీసుకువచ్చాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో సి.పి.ఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్ తీసుకువస్తాను అని చెప్పారు . అది ఈరోజుకు అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్మెంట్ తో పి.ఆర్.సి ఇవ్వాల్సి ఉంది. సజ్జల రామకృష్ణ గారు వచ్చి నెలాఖరుకు అమలు చేస్తాం అని చెప్పారు. దయచేసి మాకు పి.ఆర్.సి నివేదిక ఇవ్వాలని కోరం 1.7.2018 నుండి మేము ఏమయితే డిమాండ్ తీసుకొచ్చామో డిమాండ్లు పరిస్కరించాలని కోరుతున్నాం. 7 డి.ఏ లలో ఇప్పటికి రెండు డి.ఏ లను మాత్రమే ఇచ్చారు. మా డబ్బులు ఎప్పుడు వేస్తారు అని అడిగారు.
నా సర్వీస్ మొత్తంలో ఎప్పుడు 1వ తేదీనా జీతం వేయాలని డిమాండ్ పెట్టె పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్ఛేలా ఉంది. ఇవి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాను అని చెప్పారు. దాని జాడ లేదు. ఇరు జె.ఏ.సి లు కలిసి అధికారులను అందరిని కలిసాం ఏ ఉపయోగం లేదు. విద్య , వైద్యం లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అడిగి అడిగి వేసారి గచ్చన్తరం లేని పరిస్థితుల్లో ఈ ఉద్యమానికి పిలుపునిచ్చాము. గ్రామ సచివాలయం ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చెయ్యలేదు ఎందువలన చెయ్యలేదు. జీవో 140 తీసుకుని వచ్చి పిహెచ్సి ఉద్యోగుల జీవితాల్లో అందకారం నింపారు. ప్రభుత్వం ఉపా చట్టాలు ఉపయోగించినా… మా ఉద్యమం ఆగదు అని పేర్కొన్నారు.