పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఆందోళనల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Also: చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ : అంబటి రాంబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అంత భయం ఎందుకని జగన్ సర్కారును ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని, అయినా స్పందన రాలేదని ఆరోపించారు. ఇక ప్రభుత్వం నుంచి స్పందన రాదని తెలిసే తాము ఉద్యమం చేపట్టామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని తాము ఇరుకునపడేయలేదని బొప్పరాజు గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బందిపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ తాము సంయమనంతో ఉన్నామని తెలిపారు.
ఏపీలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు#AndhraPradesh #EmployeeAttendingDuties #BlackBadges #NTVNews #NTVTelugu pic.twitter.com/sQohAqxuoP
— NTV Telugu (@NtvTeluguLive) December 7, 2021