ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా…
ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో…
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరను తాజాగా ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లలో అయితే రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ…
పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. పీఆర్సీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏలను భారీగా తగ్గించడంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి. పీఆర్సీ జీవోలన్ని ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్నాయని బండి వెంకట్రామిరెడ్డి అన్నారు. Read Also: తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం…
చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం… చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందంటూ.. నాటక ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్యులు.. దీంతో.. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా చింతామని నాటకాన్ని నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షంవ్యక్తం చేశారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య…