ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశ అనంతరం విధి విధానాలు వెల్లడిస్తామన్నారు.
పీఆర్సీ పై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు: సూర్యనారాయణ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత
పీఆర్సీ పై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. గంభీర పరిస్థితిని అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. పర్సనల్ అజెండా, అంతర్గత విభేధాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు.ఒకే తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని డిసైడ్ అయ్యాం. మా పోరాటం చరిత్రలో లిఖించేందుకు కారణమవుతుంది. రేపటి నుంచి అందరిదీ ఒకటే మాట, ఒకే వాదన, ఒకటే డిమాండ్ ఉంటుందన్నారు.
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలి: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అందరి సమస్య ఒకటే కాబట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యమై ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించాం. మెరుగైన పీఆర్సీ కోసం కలసి పోరాడనున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రేపు సచివాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణ రేపు ప్రకటిస్తామని తెలిపారు.
నలుగురం ఏకాభిప్రాయానికి వచ్చాం: బొప్పరాజు, ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్
సచివాలయంలోని కార్యాలయంలో రేపు అన్ని డిమాండ్లపై చర్చించనున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. మెరుగైన పీఆర్సీ సహా ఎలాంటి డిమాండ్లు పెట్టాలనే అంశంపై చర్చిస్తామన్నారు. సమావేశంలో జరిగిన చర్చలను మా జేఏసీ సమావేశంలో తెలియజేస్తామన్నారు. ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మా జేఎసీల ఐక్యవేదికలతో అందరితో చర్చిస్తాం. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం. సమ్మె నోటీసు పై వెనక్కి తగ్గేది లేదు. అందరం కలిసి రేపు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు తెలిపారు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!