సీఎం జగన్ ను నిద్ర లేపడానికే వచ్చానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం ధమన కాండ ను చెప్పడానికే వచ్చానని, ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్నారు. ఏపీలో పోలీస్ స్టేషన్లు తగులబెట్టారు..పోలీస్ లపై దాడులు చేస్తున్నారు…అలాంటి వారిపై తక్కువ యాక్షన్ తీసుకొని బీజేపీ క్యాడర్ పై కేసులు పెడుతున్నారని అరుణ్ సింగ్ ఆరోపించారు. యూపీలో సీఎం ఎస్పీ ప్రభుత్వంలో మతదాడులు జరిగేవి.. 2017లో ప్రజలు ఎస్పీ ప్రభుత్వాన్ని జనం ఎత్తేశారు. ఇది జగన్ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీని దించి బీజేపీని గద్దెనెక్కిస్తారన్నారు. అస్సాంలో కూడా కాంగ్రెస్ ఓటు రాజకీయాలు చేసినందుకు ఆ ఆ పార్టీని దించి బీజేపీకి అధికారం ఇచ్చారన్నారు.
Read Also:కొడాలి నానిపై వచ్చిన ఆరోపణలు నిరూపించడానికి సిద్ధం: బోండా ఉమ
త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గుణపాఠం చెప్పారన్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా వారి బాలికలు బయటికి వచ్చే పరిస్థితులు ఉండవన్నారు. పాకిస్తాన్ గెలిచినప్పుడు సంబురాలు చేసుకుంటున్నారు. అన్ని మతాల అభివృద్ధిని కోరుతూ మోడీ పరిపాలిస్తున్నారు. జగన్ మోడీ పాలనను చూసి నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు. ఎమ్మెల్యే చక్రపాణి తల్లిదండ్రులు మంచి పేరు ఎత్తారు…ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతూ మసీదు నిర్మాణాన్ని ప్రోత్సహించారు. జగన్ అధికారంలోకి వచ్చే ముందు 3 వేల కి.మీ పాదయాత్ర చేసి జనంలోకి వచ్చారు… జగన్ అధికారంలోకి వచ్చాక జనంలోకి రావడం లేదు…ఎంపీ , ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సీఎం జగన్ తన లేబుల్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని అరుణ్ సింగ్ ఎద్దేవా చేశారు.