సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్ నడుస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో…
ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో…
ఏపీ ఉద్యోగుల పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఓవైపు ప్రభుత్వం ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి వ్యవహరించాలని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం అందుకు సంసిద్ధంగా లేరు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపిన అవేవి సఫలం కాలేదు. అటు ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఒకే తాటి మీదకు తీసుకురావాలని సీఎస్ సమీర్ శర్మ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. మంత్రులు సైతం పలు మార్లు ఉద్యగ సంఘాల నాయకులతో భేటీ అయినప్పటికీ పరిస్థితిలో మార్పు…
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా…
ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో…
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్…