విజయవాడలో పీఆర్సీ సాధన సమితి భేటీ ముగిసింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు పాల్గొన్నారు.
Read Also: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్
అంతేకాకుండా ఉద్యోగులకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని మంత్రుల కమిటీకి రాసే లేఖలో కోరాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేయనున్నారు. మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు మళ్లీ చర్చలు జరపాలని.. కాంట్రాక్ట్, NMR ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెడతామని పీఆర్సీ సాధన సమితి ఉద్యోగులు వెల్లడించారు.