ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరుపుతాం: సజ్జల, బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాం. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం వస్తామని మంత్రులు పేర్కొన్నారు.
Read Also: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత..రైతులతో కొలిక్కి రాని చర్చలు
Also Read
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
మరో సారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని బొత్స, సజ్జల ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వంలో భాగమేనని వారన్నారు. ఏ సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని ఉద్యోగులను రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసిందో ప్రజలకు వివరించటం తప్పేలా అవుతుందన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని బొత్స, సజ్జల తెలిపారు. ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు నిజమైన సమస్యలుంటే పరిష్కారానికి కృషి చేస్తుందని వారు అన్నారు. ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్‌కు అర్థం ఉండదని వారు వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుందని మంత్రులు సజ్జల, బొత్స తెలిపారు.
తాజావార్తలు
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!