ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు. కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నన్ ఇచ్చింది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్,…
జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ…
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో…
కరోనా మహమ్మారి ఎంట్రీ అయిన తర్వాత ప్రతీరోజు కరోనా కేసులు, రికవరీ కేసులు, యాక్టివ్ కేసులు.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా పూర్తి వివరాలు వెల్లడిస్తూ వస్తుంది వైద్య ఆరోగ్యశాఖ.. ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు నమోదైన వివరాలను బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ వస్తోంది.. అయితే, ఇవాళ్టి నుంచి కరోనా బులెటిన్ ఇవ్వకూడదని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది… Read…
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే.. మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Read Also: IMD: వాతావరణశాఖ చల్లని…
ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి జనరేటర్లు ఆన్‌చేశాం అంటారని… తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేశామంటున్నారని.. ఇదంతా ఎంటర్టైన్మెంట్కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని అశోక్ గజపతిరాజు…
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్‌ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కాగా…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి…