Andhra Pradesh: పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పటి వరకు PF, GPF ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం రిటైర్‌మెంట్ తర్వాతే చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2020-డిసెంబర్ 2021 వరకు రావాల్సిన 21 నెలల పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Crime News: ఏపీలో మరో దారుణం.. బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
మరోవైపు ప్రభుత్వ పింఛనుదార్లకు ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను 2023 జనవరి నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఐఆర్ రికవరీ ఉండదని స్పష్టం చేసింది. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనం జనవరి 2022 నుంచి ఇస్తామని పేర్కొంది. అటు ఉద్యోగులకు పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. జనవరి 2022 నుంచి ఇది వర్తిస్తుంది.
కాగా పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామనడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకించారు. రెండు, మూడేళ్లలో పదవీ విరమణ పొందే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని,.. 15-20 ఏళ్ల సర్వీసు ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, చర్చల సమయంలోనూ దీన్ని చెప్పలేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!