ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.…
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో భగత్‌సింగ్ కాలనీ జలదిగ్బంధలో చిక్కుకుంది. వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాలు సైతం నీటితో మునిపోయాయి. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో పెన్నానది పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. బుచ్చిమండంలో మినగల్లు, పెనుబల్లి, కాకులపాడు, దామరమడుగు గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. వీటితో పాటు కోవూరు, ఇందుకూరుపేట, విడవటూరు…
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు,…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో తన ప్రభావం చూపుతోంది. ఈ రోజు ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Also Read : నిండుకుండలా కళ్యాణి జలాశయం.. పొంగుతున్న చెరువులు ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో వరదనీటిలో నలుగురు…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని నక్కలకాలనీ నీట మునిగింది. దీంతో షికారీలు జాతీయ…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని…