Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంటే, తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతించింది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు తెలంగాణలో రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పింఛనర్లు.. బిల్లులు రీయింబర్స్ కాక నష్టపోయారు.. దీంతో, ఇకపై తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది..
Read Also: Minister Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇంకా అనుమానాలు ఎందుకు..? త్వరలోనే ప్రధానితో భేటీ..