Karumuri Nageswara Rao: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన కాపు సామాజికవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుకున్నవన్నీ చేసే వరకు సీఎం వైఎస్ జగన్ నిద్రపోరని తెలిపారు. ఇక, టీడీపీ, జనసేనపై హాట్ కామెంట్లు చేసిన కారుమూరి… ముద్రగడ పద్మనాభం జీవితం కొవ్వత్తి.. తాను కరిగిపోతూ ఎంతో మందికి వెలుగు ఇచ్చారని పేర్కొన్నారు. కాపులను అడ్డు పెట్టుకొని కొందరు పైకి రావడానికి చూస్తున్నారు.. కానీ, తన జాతిపైకి రావడానికి ముద్రగడ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కాపుల సహకారం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.. పేదలకు మేలు చేయాలని ఆలోచించే సీఎం జగన్ కు ముద్రగడ తోడు కావడంతో మరిన్ని మంచిపనులు చేసే అవకాశం వచ్చిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
Read Also: Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కోసం కొత్త ఇల్లు.. వీడియోలు వైరల్!
మరోవైపు పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు కాపు ఉద్యమనేత, వైసీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు సామాజిక ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్లబ్బులు నడిపే వాళ్లచేత నన్ను పవన్ కల్యాణ్ తిట్టిస్తున్నారు.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఉద్యమం ఎందుకు ఆపేశారు అంటున్నారు.. చంద్రబాబు సీఎం అయ్యాక మీరు ఏ మడుగులో దాక్కున్నారు..? అంటూ నిలదీశారు. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి.. చాటున ఉండి మాట్లాడటం మగతనం అనిపించుకోదు అని వ్యాఖ్యానించారు.
Read Also: Harish Rao: కేసీఆర్‌పై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్
ఇక, పవన్ కల్యాణ్ ప్రజల కోసం రాలేదు.. చంద్రబాబు ఎస్టేట్ కు మేనేజర్ గా వచ్చాడు అంటూ ఎద్దేవా చేశారు ముద్రగడ. 20 సీట్లకు పవన్ కల్యాణ్.. ముఖ్య మంత్రి అయిపోతాడట అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర దేనికి చేశారు..? అని నిలదీశారు. లోకేష్, పవన్ కోసం యాత్ర చేశాడా..? అని ప్రశ్నించారు. కూటమికి అధికారం ఇస్తే సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తా అంటున్నారు.. మేం అమలు చేయలేమా..? దమ్ము ఉంటే అంతకు మించిన పథకాలు తీసుకు రండి.. అంటూ సవాల్ చేశారు ముద్రగడ పద్మానభం.