Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.. ఇక, ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ వస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేస్తూనే ఉన్నారు.. అయితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన పలువురు వాలంటీర్లు.. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ఉన్న రాజీనామా పత్రాలను సీఎంకు అందజేశారు.. నెల్లూరు జిల్లా ఆర్‌ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లంచ్ స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు వాలంటీర్లు.
Read Also: Sasivadane: ఏప్రిల్ 19న మైత్రీ డిస్ట్రిబ్యూషన్లో శశివదనే రిలీజ్
అయితే, రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. అంతా రాజీనామా చేశారా? అని ప్రశ్నించిన ఆయన.. జూన్ 4వ తేదీన మనం వస్తూనే మన మొట్టమొదటి సంతకం మరలా మిమ్మల్ని పెట్టడమే అని స్పష్టం చేశారు.. ఇదొక్కటే కాకుండా మీరు ఇంత బాగా పనిచేశారు కాబట్టే.. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. మీరు ఇంత బాగా పనిచేశారు.. కాబట్టి.. మీ అందరికీ సేవా మిత్రలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు అవార్డులు ఇచ్చామని గుర్తుచేశారు. మనం వచ్చిన తర్వాత అవి స్టాండర్డ్ చేస్తాను అని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.