ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుంటారు.. ఇక, స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు..
ఏపీలో నాల్గవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సహంగా సాగింది. నామినేషన్ల దాఖలకు ముందు కొందరు అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నడుమ భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. అధికార, విపక్ష పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 293 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతేకాకుండా.. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇప్పటి…
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస…
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి డోన్ బహిరంగ సభలో కోట్ల, కె.యి.లపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నారు.. మీకు నిజంగా అభివృద్ధి అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. మీ దృష్టిలో కేఈ కోట్ల కలవడమే అభివృద్ధా అని మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి చూడాలంటే వారం రోజులు పడుతుందని చెప్పారు. 2014లో తాను రూ.50 లక్షలతో స్కూలు భవనాన్ని కట్టాలనుకుంటే…
విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.…
కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్ వేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిది కార్పొరేటర్ స్థాయి కంటే హీనం అని విమర్శించారు. ఆయనకి 12 లేదా 14 వేల ఓట్లు మాత్రమే వస్తాయి.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధి కూడా విజయం మీకు లేదా మాకు మధ్యే అని చెప్పాడన్నారు. ఫలితాలు చూస్తే అతనికి 12 వేల ఓట్లు వచ్చాయన్నారు.