Duvvada Srinivas and Vani: పోటీ నుంచి తప్పుకున్న భార్య..! దువ్వాడకు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas and Vani: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.. దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదు అనే ప్రచారం జోరుగా సాగింది.. ఆయనపై సొంత భార్య దువ్వాడ వాణి పోటీకి సిద్ధం కావడమే దీనికి ప్రధానం కారణం.. తాను స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలైన దువ్వాడ వాణి.. తన అనుచరుల సమక్షంలో ప్రకటించడం కలకలం రేపింది.. ఆమె ప్రకటించిన ప్రకారం.. ఈ నె 22న అంటే సోమవారమే నామినేషన్ వేయాల్సి ఉంది… కానీ, నామినేషన్ వేయడంపై వెనక్కి తగ్గారట దువ్వాడ వాణి.. టెక్కలిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా 22న నామినేషన్ వేసేందుకు రెడీ అన్న దువ్వాడ వాణి.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
Read Also: Gita Sabharwal: ఇండోనేషియాలో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా గీతా సబర్వాల్ నియామకం
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
అయితే, తమ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.. మొత్తానికి భర్తపై భార్య పోటీ లేనట్టే అన్నమాట.. తాజా పరిణామాలతో టెక్కలి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుందంటున్నారు. కాగా, తన భార్య వాణి నామినేషన్ వేస్తానన్న వ్యాఖ్యలపై ఆ మధ్య స్పందించిన టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్… వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదని కామెంట్ చేశారు.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చెప్పుకొచ్చారు.. అయితే ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నానంటూ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!