ఎన్నికల వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. మంచి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు.
పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు.
రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవడమేనని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ అధినేత,సిఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు అని, బీజేపీ అవినీతి కూటమిగా మారిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ కాదు చీటింగ్ సిక్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇస్తే జాతీయ వనరులన్నీ వృధా అయిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సోమరులు అయిపోతారు అని చెప్పిన పార్టీ టీడీపీ అని, వైసీపీ సంక్షేమాలు పథకాలు కొనసాగిస్తాం.. 2 వేలో 3…