ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీ జోరు పెంచింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు.
బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల రణరంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.