Pawan Kalyan: వల్లభనేని వంశీపై మండిపడ్డ పవన్.. ఒక ఓటు అటు.. ఒకటి ఇటు అంటున్నాడట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్‌లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరికాదు అని హితవుపలికారు.. ఇక, ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ.. అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందన్నారు పవన్.. నారా భువనేశ్వరిని కించపరచడం బాధ కలిగించిందన్న ఆయన.. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే.. స్త్రీని అగౌరవపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందన్నారు.
Read Also: Sun Stroke: హీట్ స్ట్రోక్ రోగుల కోసం ఐస్ మేకింగ్ రిఫ్రిజిరేటర్, ఇమ్మర్షన్ టబ్.. ఫొటోస్ వైరల్..
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
ఇక, మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రికి ఎన్నికలు ఉన్నాయి.. రాష్ట్ర దిశ, భవిష్యత్ ను నిర్ణయం చేసే ఎన్నికలు ఇవి.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు పవన్ కల్యాణ్.. ఆత్మ గౌరవం తాకట్టు పెట్ట లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం హనుమాన్ జంక్షన్‌లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీ ర్యాలీగా హనుమాన్ జంక్షన్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత సభలో మాట్లాడారు… ఓవైపు సీఎం వైఎస్ జగన్‌పై మండిపడుతూనే.. మరోవైపు.. వల్లభనేని వంశీపై విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతంగా ఉండే కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉపాధి ఇవ్వగలుగుతుంది అన్నారు పవన్ కల్యాణ్.
మరోవైపు.. గన్నవరం నియోజక వర్గంలో వందల కోట్లు దోపిడీ జరిగింది అని ఆరోపించారు పవన్.. వంశీ డబ్బులు ఇచ్చినా మాయమాటలు చెబితే నమ్మవద్దు.. వంశీ నాకు పరిచయమే..కానీ జనహితం నాకు ముఖ్యం అని స్పష్టం చేశారు.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ మారుస్తూ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టిలో పడటానికి ఎంతకైనా దిగజారారు.. ఏపీ రాజకీయాలను వైసీపీ నేతలు దిగజార్చారని ఫైర్ అయ్యారు.. యువతికి ఉపాధి కల్పిస్తాం .. వచ్చే ఎన్నికల్లో కూటమిదే పీఠం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!