Prabhas’s Aunt Shyamala Devi Campaigns to Support BJP MP Narasapuram Candidate: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించగా మళ్ళీ మళ్ళీ రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు మద్దతుగా దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రచారం చేశారు.
Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?
నిన్న మొగల్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, నేడు నరసాపురంలో మత్స్యకారుల ఆత్మీయ సదస్సులో శ్యామలాదేవి పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమికి మద్దతు పలుకుతూ వైసీపీలో చేరుతారనే ఊహాగానాలకు తెరదించారు. ఇక ఈ ఏడాది కృష్ణంరాజు జయవంతి వేడుకల్లో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజల అభీష్టం మేరకే తమ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు విద్య, వైద్య పరంగా ఏ కష్టం వచ్చినా మేం అండగా నిలబడతామని ప్రకటించారు.