Minister RK Roja: ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల 27 తేదీ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.. 2014 గెలిచి చంద్రబాబు ప్రజలు మోసం చేశారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా సహా చాలా హామీలు ఇచ్చారు.. చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని దుయ్యబట్టారు.. టీడీపీ, జనసేన అభ్యర్థులను అత్యంత పేలవంగా రిలీజ్ చేశారు.. దాంతో మా వాళ్లు గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఇక, ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్లకి టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు..
Read Also: Wedding invitation: పెళ్లి కార్డుపై మోడీ ఫోటో.. బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం..!
గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయి అందుకే 24 సీట్లు అని.. అది ఇది అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారు.. మరి ఇప్పుడు 21 సీట్లకు ఏమీ చెప్పాలో పవన్ కల్యాణ్‌కు త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు మంత్రి రోజా.. జనసేన పార్టీ సైతం టీడీపీ నేతలకే టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఇక, ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ సీఎం జగన్‌కు ఉందన్నారు. ప్రజలంతా 175 స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి రెడీ ఉన్నారని తెలిపారు.. సిద్ధం సభలకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆశతో ప్రజలు ఉన్నట్టు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.