ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు పోలీసులు..
గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
చిన్న పరిమి గ్రామానికి చెందిన బాధితుడు అజ్గర్‌ను ఈ నెల 30వ తేదీన కొందరు యువకులు పని ఉందంటూ చండూరు డొంకలోకి తీసుకు వెళ్లి మద్యం తాగించారు. వారు కూడా మద్యం సేవించారు.. ఆ తర్వాత ఏవేవో కారణాలు చెబుతూ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులు తీసుకుని చితకబాదారు. బాధిత యువకుడు కొట్టొద్దని మొత్తుకున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా