AP Crime: దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.. దట్టమైన పొదల్లో.. తల్లి మృతదేహం వెనుకే వేలాడింది.. ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి ఎంత అలమటించిపోయిందో.. ఎవరూ కనిపించక.. రెండు రోజుల పాటు ఎంత భయంతో వణికిపోయిందో.. చివరకు తల్లి జోలె నుంచి కిందకు జారి.. పొదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు పొక్కింది.
Read Also: BRS-Congress Flexi War: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ (25).. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన కొండాను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. వారిలో రెండేళ్ల చిన్న కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. పానిరంగనీలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది పద్మ.. బుధవారం తన సోదరి ఇంటికి వెళ్లిన ఆమ.. అందరితో కలిసి భోజనం చేసింది. ఇక, ఇంట్లోవాళ్లు పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ కనిపించలేదు. దీంతో.. వారు పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించారు. అయితే, రెండు రోజుల తర్వాత చివరకు శుక్రవారం రోజు ఉదయం రెండేళ్ల చిన్నారి పానిరంగిని గ్రామ సమీపంలో ఏడ్చుకుంటూ రావడంతో వారు చుట్టుపక్కల వెతికారు. హైవే పక్కన సమీపంలో పొదల్లో చెట్టుకు వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. పాపని తన జోలెలో చుట్టుకుని పద్మ ఉరివేసుకొని మృతి చెందినట్టు.. ఆ పరిస్థితులను గమనించినవారు చెబుతున్నారు.. రెండు రోజులపాటు చిన్నారి ఎంత బాధకు గురైందో ఎంతలా ఏడ్చిందో . చివరకు ఎలాగోలా జోలి నుంచి విడిపడి చిన్నారి రోడ్డుపైకి చేరుకుంది. ఈ హృదయ విదారక సంఘటనను తలుచుకుంటేనో అందరి హృదయాలను కలచివేస్తోంది.. చిన్నారి పుష్పను దోమలు, పురుగులు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. పోలీసులు అనుమానస్పద మృతిగా చేసి నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.. క్లూస్ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు..