పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో వాళ్లకి.. స్నేహితులకు కష్టాలు అంటే ఇదేనేమో.. కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తల్లిని పట్టుకుని స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది..
అన్నదమ్ములు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది.. జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఏప్రిల్ నెలలో ఇంటి వెళ్లిపోయారు అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32).. తాజాగా వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు..
సెల్ ఫోన్ దొంగలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం జోలపాలెంలో జరిగింది. సెల్‌ఫోన్ విషయంపై జరిగిన గొడవలో దంపతులపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.
తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. చిన్నారి అని కూడా చూడకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఏడాది కాలంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తూ.. నరకం చూపించాడు.. అంతే కాదు.. అభం శుభం తెలియని చిన్నారిపై తన ప్రియుడు అత్యాచారం చేయడానికి.. ఆ పాప తల్లి సహకరించడం కలకలం రేపుతోంది..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు.
దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.