Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని…
Gudivada Amarnath: మరోసారి కూటమి సర్కార్‌పై విమర్శలకు దిగారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలుగుతోందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ కబ్జాలు, భూ వివాదాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడుల కోసం ముందుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయని రాజకీయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు…
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ వికృత క్రీడ ఆడుతున్నాడని నిప్పులు చెరిగారు.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు… పవన్ కల్యాణ్‌కు ఏది కావాలో.. చంద్రబాబు అది ఇస్తాడు.. కాబట్టే ఆయన చెప్పినట్టుగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక, కూటమి నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు…
Shetty Balija Scholarships: తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మంత్రులు సవిత, వాసంశెట్టి సుభాష్‌లతో కలిసి శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లులో తనను గెలిపించింది బీసీలు, ఎస్సీలే అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి గౌడ, శెట్టి బలిజలు మద్దతు ఉంటుందని అన్నారు. బంజేయుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. READ ALSO:…
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు.…
Minister Anitha: కృష్ణా జిల్లాలో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారు అని ఆరోపించింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నది మీరు కదా?.. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు... పార్టీ ఉండదు... రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా…
సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.