Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. అందులో ఇద్దరు
మరణించారన్నారు..
కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. “అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అశోక్ గజపతిరాజుకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతిరాజు పరామర్శించారా.. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి.. మా ఐదేళ్ల పాలన కంటే, కూటమి ఏడాదిన్నర పాలనలో తక్కువ నేరాలు జరిగాయి అంటే నేను తలదించుకుంటాను. అమ్మవారి పండుగను రాజకీయం చేయడం తగదు. కిమిడి నాగార్జున చరిత్ర చెపితే టీడీపీనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.