ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.
సీట్ల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.జగన్ తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగ్గే ఇప్పుడు ఎమ్మెల్యేలలో వుందన్నారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు.
రేపు వరుస కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
పేద ప్రజలకు ఆరోగ్యదాయినిగా నిలిచే డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒక్కో కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలను అందించే అపర సంజీవని ఆరోగ్యశ్రీ. క్యాన్సర్ చికిత్సతో పరిమితి లేకుండా ఎంత ఖర్చయినా వెనకాడక ఉచితంగా వైద్య సాయాన్ని అందజేస్తోంది జ
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు కసరత్తు వేగంగా జరుగుతోంది.
ఈ నెల 20న(ఎల్లుండి) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది.
ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు.