CM YS Jagan: సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం సంస్థ ఉద్యోగులతో ఇంటరాక్షన్ అయ్యారు. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బద్వేల్ నియోజకవర్గం గోపవరం దగ్గర 490 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. పారిశ్రామిక పార్క్‌లో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్ ఇండస్ట్రీ ఏర్పాటు జరిగింది. వంద ఎకరాల్లో 1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేశారు. 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరిన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. సరిగ్గా రెండేళ్ళ కిందట సెంచురీ ప్యానల్స్ పరిశ్రమను డిసెంబర్ 23, 2021న భూమి పూజ చేశారు సీఎం జగన్. ఇవాళ సెంచురీ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించడం గమనార్హం.
Read Also: Undavalli Arun Kumar: ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి కడపకు సీఎం జగన్ చేరుకోనున్నారు. కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్సార్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ చేరుకోనున్నారు. స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఆధునికీకరించిన కలెక్టరేట్ భవనం, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయనున్నారు. రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌లో బస చేయనున్నారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!