YSR Aarogyasri: పేద ప్రజలకు ఆరోగ్యదాయినిగా నిలిచే డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒక్కో కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలను అందించే అపర సంజీవని ఆరోగ్యశ్రీ. క్యాన్సర్ చికిత్సతో పరిమితి లేకుండా ఎంత ఖర్చయినా వెనకాడక ఉచితంగా వైద్య సాయాన్ని అందజేస్తోంది జగన్ సర్కారు. ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ.. కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేస్తోంది. ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని కుటుంబసభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని వివరాలతో అభా ఐడీ ఉంటుంది.
Read Also: YSRCP: వైసీపీలో వేగంగా ఎమ్మెల్యేల మార్పు కసరత్తు.. సిట్టింగ్‌ల చివరి ప్రయత్నాలు!
అంతే కాకుండా 2308 నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా.. 30 స్పెషాలిటీస్‌కి సంబంధించి 3257 ప్రొసీజర్స్ అనుసరించి.. ఏటా 3600 కోట్ల రూపాయల వ్యయం చేయడం మాత్రమే కాకుండా ఆరోగ్య ఆసరాకు కూడా రూ.500 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు వైద్య రంగంలో ఆంధ్రజాతి కనీవినీ ఎరగని సరికొత్త అధ్యాయంగా డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నిలవనుంది. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో చిత్తశుద్ధిని కనబరుస్తోంది ఏపీ సర్కారు.
ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా?
*104కి కాల్ చేయడం ద్వారా..
*వాలంటీర్‌కి చెప్పడం ద్వారా..
*విలేజ్ క్లీనిక్‌లో సంప్పదించడం ద్వారా..
*ఎమర్జెన్సీ సమయాల్లో 108కి కాల్ చేయడం ద్వారా..
*ఫ్యామిలీ డాక్టర్‌ను కన్సల్ట్ చేయడం ద్వారా..
*ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సంబంధిత వైద్య నెట్‌వర్క్‌లో ఉచిత వైద్యం పొందవచ్చు.
సీఎం జగన్ ఏమన్నారంటే..
వైద్య సేవల కోసం ఏ పేదవాడైనా ఆస్పత్రికి పోతే అక్కడ గర్వంగా తలెత్తుకుని చికిత్స అనంతరం ఇంటికి వచ్చే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. డాక్టర్లు గానీ, ఆస్పత్రులు గానీ చిన్నచూపు చూసే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచామని సీఎం వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి ఏయే పత్రాలు తీసుకెళ్లాలి..
ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులో ఉండే మీ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
మీకు ఆస్పత్రిలో ఉచితంగా అందించి వైద్య సేవలివే..
*ఉచిత అడ్మిషన్
*డాక్టర్ సంప్రదింపులు(ప్రతిరోజు)
*నర్సింగ్ సేవలు(ప్రతిరోజు)
*అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు
*అవసరమైన మందులన్నీ ఉచితంగా ఇవ్వబడును
*శస్త్ర చికిత్స(ఆపరేషన్ చికిత్స)
*శస్త్ర చికిత్సకు అవసరమైన ఇంప్లాంట్లు
*అల్పాహారము, భోజనము(రెండు పూటలు)
*డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు
*మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం మీ ఖాతాకు పంపుతారు.
*ఇంటికి వెళ్లడానికి అవసరమయ్యే చార్జీలు సైతం ఉచితం
*10 రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి మీరు మళ్లీ ఉచితంగా చూపించుకోవచ్చు.
ఆరోగ్యశ్రీ సేవలు సంతృప్తికరంగా లేకుంటే..
*104కి ఫోన్ చేసి కంప్లయింట్ చేయవచ్చు
*ఈ కంప్లయింట్ జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్‌కు అనుసంధానమవుతుంది
*తద్వారా త్వరతగతిన చర్యలు తీసుకోబడతాయి
*మీ నుంచి ఎవరైనా డబ్బు ఆశించి ఉంటే 14400 నెంబర్‌కి ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చు.