AP CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పరేడ్ ప్రదర్శనను ముఖ్యమంత్రి జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు.
PM Narendra Modi: ఆత్మ నిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖల శకటాలను అధికారులు సిద్ధం చేశారు.