ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లాలోని నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు.
చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని ఆయమ మండిపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.