ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఏపీ సర్కారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి ఏపీఎఫ్ డిసి చైర్మైన్ గా నేడు బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది ఏపీ సీఎం జగన్ ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఆ పదవి బాధ్యతలను నేడు పోసాని చేపట్టారు.
ఏపీ సీఎం జనగ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డా హీరో బాలకృష్ణ. హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ కంప్యూటర్లను పంపిణీ చేసారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని మండిపడ్డారు.
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి రుణ పరిమితి పెంపుపైన కూడా ప్రధానిని అడిగినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు ఏపీకి ప్రత్యేక హోదా, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్…