Today Events, April 10, 2023
* ఐపీఎల్2023: బెంగళూర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో మ్యాచ్
* మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో నేడు టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
* పేపర్ లీకేజీ నోటీసుల పైన నేడు వరంగల్ పోలీసులకు వివరణ ఇవ్వనున్న ఈటల రాజేందర్.. ఉదయం 11 గంటలకు వరంగల్ పోలీసు కమిషనరేట్ లోని డీసీపీ ఆఫీసుకు రానున్న బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
* నేడు గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుల పర్యటన
* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో నేడు శ్రీ గంగాభవానీ జాతర.. అధికసంఖ్యలో పాల్గొననున్న భక్తులు..జాతరలో భాగంగా ప్రత్యేకమైన వరద పాయసం ఘట్టాన్ని తిలకించనున్న భక్తజనం
* విజయవాడలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ధర్నా..
*నేడు జిల్లాలోని సర్పంచ్ లు పడుతున్న ఇబ్బందులపై ఉమ్మడి కృష్ణ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్ వద్ద సదస్సు
*నేడు పలాస మున్సిపాలిటీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…పాల్గొననున్న మంత్రి సీదిరి అప్పల రాజు
* కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* తిరుపతిలో పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఏపీఎస్పీడీసీఎల్ వద్ద నిరసనకు టీడీపీ ధర్నా