గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారట సంజయ్.. ఇక, సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..
సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నారు.. వీరిపై నిఘా పెట్టాం.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించాం.. వీరి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.