CID Chief Sanjay: అందుకే చంద్రబాబు అరెస్ట్.. కీలక అంశాలు వెల్లడించిన సీఐడీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CID Chief Sanjay: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక అంశాలను బయటపెట్టారు సీఐడీ చీఫ్ సంజయ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్తాయి.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తి సంబధం ఉంది కాబట్టే అరెస్టు చేశాం అన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తికే చాలా పదవులు ఇవ్వడంతోపాటు కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఆయన.. టీడీపీకి చెందిన జే. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్ గా నియమించారు.. ఈ వ్యవహారంలో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారు.. జీవోలో 90 – 10 శాతం వాటాలను పేర్కొన్నారు.. కానీ, ఒప్పందంలో లేదన్నారు.
ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అన్నారు సీఐడీ చీఫ్.. సేమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ కూడా 164 స్టేట్ మెంట్ ఇచ్చారు అని తెలిపారు. 58 కోట్లు మాత్రమే మాకు వచ్చాయని సిమెన్స్ సంస్థ పేర్కొంది.. 241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లిపోయినట్టు వివరించారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారు.. ఇక్కడ నేరం లో ఇమిడి ఉన్న డబ్బు 241 కోట్ల రూపాయలు అన్నారు. డిజైన్ టెక్ ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి.. 58 కోట్లతో కొనుగోలు చేసి 2800 కోట్లుగా చూపించారు.. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయి.. కానీ, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి.. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో 2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు.. డిజైన్ టెక్ కు చెందిన 32 కోట్లు ఈడీ సీజ్ చేసిందని తెలిపారు.. ఇక, మీడియాతో మాట్లాడిన సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించిన కీలక అంశాలు తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!