ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు ఐఐటీ నిపుణులు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పునాదులు వేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. గత ఐదేళ్లూ పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ ప్రాంగణం
Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి…
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్‌డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే... అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.