AP Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు ఐఐటీ నిపుణులు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పునాదులు వేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. గత ఐదేళ్లూ పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ ప్రాంగణం. పడవల్లో వెళ్లి పునాదులను పరిశీలించారు ఐఐటీ చెన్నై ఇంజనీర్లు. పునాదుల్లో నీళ్లు ఎప్పటి నుంచి ఉన్నాయని సమాచారం సేకరిస్తోన్నారు నిపుణులు. పునాదుల్లో మట్టి, కంకర శాంపిల్స్ తీసుకున్నారు నిపుణులు. ఇన్నేళ్లూ నీళ్లల్లో పునాదులు ఉండిపోవడంతో భవిష్యత్ నిర్మాణాలకు ఎంత వరకు అనువుగా ఉంటుందని పరిశీలిస్తోంది నిపుణుల బృందం.. నిన్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణులు పరిశీలించిన విషం విదితమే.. అయితే, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పటిష్టతపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి ఐఐటీ నిపుణుల బృందాలు.
Read Also: Children’s Memory: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు..
ఇక, శుక్రవారం రోజు రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పరిశీలించింది ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం.. నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు ఐఐటీ ప్రొఫెసర్ లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషా.. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్దారణకు మరికొంత సమయం పడుతుంది.. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుంది.. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.. ప్రతీ అంశాన్ని కూలంకుషంగా పరిశీలన చేసి తదుపరి నివేదిక ఇస్తాం.. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.. సామాగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉంది.. నివేదిక కు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం.. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు , ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని ప్రకటించిన విషయం విదితమే..