అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత... రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం.
ఒక చరిత్ర తిరిగి రాయడానికి మనం సిద్ధమయ్యం.. ఎంతమంది రాక్షస మూకలు వచ్చినా ఈ అమరావతిని బ్రతికించిన ఘనత ఇక్కడి రైతాంగానిదే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.