ఏపీలో అటు వైసీపీని, ఇటు టీడీపీపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై స్పందించారు బీజేపీ నేతలు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చేతకాని అసమర్ధ పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని విమర్శించారు. చంద్రబాబు స్వార్ధపూరిత నిర్ణయం వల్లనే అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. జగన్ మూడు రాజధానుల డ్రామాకు కారణం చంద్రబాబు నాయుడే అన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Read Also: Ukraine Crisis: నాటోలో తొలగిన విభేదాలు.. ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు
800 కోట్లతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. చంద్రబాబు కనీసం శాశ్వత శాసనసభ అయినా కట్టాడా??జగన్ ఈ మూడున్నర ఏళ్ళల్లో కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు అయినా కట్టారా?దోపిడిలో తేడా వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజా పోరు 2 పేరుతో 50 లక్షల ఇళ్ళను సందర్శించనున్నాం. మార్చి నెలలో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ప్రభుత్వంపై 10 వేల ప్రజా ఛార్జ్ షీట్ లను వేయనున్నాం. లక్ష హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చాడు. నవరత్నాల పేరుతో 9 హామీలు మాత్రమే పూర్తి చేశాడన్నారు. ప్రభుత్వంపై బీజేపీ పోరు సాగుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు
Read Also: Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు