ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చినవారు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పదవి ఆశించి నిరాశకు గురైనవారు అలకబూనారు.. అయితే, మంత్రి పదవి దక్కినవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. తొలిసారి మంత్రివర్గంలో అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఇదే సమయంలో.. గతంలో హోంమంత్రిగా మహిళే ఉండడంతో.. ఇప్పుడు కూడా ఆ పదవి మహిళకే ఇస్తారని.. కాబోయే హోంమంత్రి ఆర్కే రోజాయే అంటూ ప్రచారం సాగుతోంది.. రోజాకే హోంమంత్రి పదవి ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ కూడా వినిపిస్తోంది.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రోజా.. అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని నివాసానికి ప్రకాశం జిల్లా నేతలు.. కీలక నిర్ణయం..?
తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం అన్నారు రోజా.. ఏ శాఖ ఇచ్చినా తనకు ఓకే.. జగన్ టీమ్‌లో ఉంటే చాలన్నారు.. కేబినెట్‌లో సీఎం జగన్ తనకు చోటు కల్పించడం జీవితంలో మర్చిపోలేను.. టీడీపీ వాళ్లు తనను అసెంబ్లీలోకే రాకూడదని చెప్పారు.. కానీ, నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేను చేయడమే కాకుండా.. మహిళా పక్షపాతి అయిన సీఎం జగన్.. ఇవాళ మహిళల కోటాలో .. తన చెల్లెలిగా గౌరవించి.. నాకు ఎప్పుడూ అండగా ఉన్న జగనన్న.. నన్ను కేబినెట్‌లోకి తీసుకోవడం మర్చిపోలేని వఙషయం అన్నారు. ఇక, సోషల్ మీడియాలో హోంమంత్రి పదవి రోజాకే ఇవ్వాలనే డిమాండ్ వస్తుందంటూ ? ప్రశ్నించగా.. ఏ శాఖ అయినా ఓకే.. సీఎం జగన్ టీమ్‌లో ఉంటే చాలు.. ప్రజలకు సేవ చేస్తానన్నారు ఆర్కే రోజా.