వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి మరోసారి వరించింది.. విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖలను పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్.. ఇవాళ సచివాలయంలోని మూడో బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం జగన్ కేటాయించిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా.. రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తామని… పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం.. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా వెల్లడించారు.
Read also: Anil Kumar Yadav: పవన్ భీమ్లా నాయక్ కాదు.. బిచ్చ నాయక్..!
ఇక, గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి… ఆ ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తానని.. సీఎం వైఎస్ జగన్ అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా అటు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువస్తామని, అలాగే ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని వెల్లడించారు. మరోవైపు, కేబినెట్ కూర్పు వల్ల పార్టీలో ఎటువంటి అసంతృప్తులు లేవని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి.. వైఎస్ జగన్ నాయకత్వంలో అందరికీ గుర్తింపు ఉందని, ప్రతి ఒక్కరికీ సరైన గౌరవం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.