ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు కొనసాగిస్తున్నారు. ముందుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సజ్జల, తరువాత ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ..11వ పీఆర్సీ అంశాలు సహా 70 డిమాండ్లు అమలు పై సజ్జలతో…