Somu Veerraju: కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ పార్టీలను రాజకీయాల నుంచి తొలగించాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయవాడలో రెండు రోజు బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, ఎమ్మెల్సీలు, పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇంచార్జ్‌లు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు విజయవాడకు కేంద్రంగా ఉండేవి. ఇవాళ దేశాన్ని కమ్యూనిస్టు పార్టీ భ్రష్టు పట్టిస్తున్నాయి. త్వరలో 175 నియోజకవర్గాల్లో స్థానిక నేతల పాదయాత్రలు ఉంటాయి. సీపీఐ పార్టీ వాళ్ళను వాళ్ళే తొలగించుకుంటున్నారు….మోడీని తొలగిస్తాం అంటున్నారు. మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. రోడ్డు పై డ్యాన్స్‌లు వేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో దేశంలో ఎక్కడా బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఆయన మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్‌కు నమ్మకం ఉంది కనుకే మండల కమిషన్ ఏర్పాటు చేశారు. వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో అసలు తెలుసా?? ఒకేసారి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది బీజేపీ. అభివృద్ధి వికేంద్రీకరణ పై వైసీపీ, టీడీపీలకు పాఠాలు చెప్పగలిగే పార్టీ రాష్ట్రంలో బీజేపీనే. చైనా రాజధాని బీజింగ్…కాని షాంఘైని అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి అంటే అది. విశాఖను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ అంశం పై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు సోము వీర్రాజు.
హుద్ హుద్ తుఫాను అనంతం విశాఖను ఆదుకున్నామన్నారు. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా…విశాఖ. ఇది గమనించింది నరేంద్ర మోడీ. విశాఖ అభివృద్ధికి జగన్ ఒక్క వంద కోట్లు అయినా ఖర్చు పెట్టారా? చంద్రబాబు 50 కోట్లు అయినా ఖర్చు పెట్టారా? కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచన మీకు ఎక్కడ ఉందని ఘాటుగా విమర్శించారు సోము వీర్రాజు.
మీరు వేసే రోడ్ల పై బళ్ళు పడిపోతాయి…మేం వేసే రోడ్ల పై జర్రున వెళతాయి. అభివృద్ధి మా పంతం, మీది రియల్ ఎస్టేట్ దందా. ల్యాండ్ మాఫియా మీ కండక్ట్…భూ దందా మీ కండక్ట్. అభివృద్ధిలో నరేంద్ర మోడీ హీరో…మీరంతా జీరోలు. డబ్బును ఎలా దోచుకోవటమా అనేది మీ విజన్. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారు?? వైసీపీ, టీడీపీ అవినీతి 40 ఇష్టు 60. పోలవరం ఎప్పుడు ప్రారంభం అయ్యింది?? ఎవరు వేస్తే వారు తమ వాళ్ళను పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాట్ రూలింగ్ ..ఓన్లీ ట్రేడింగ్. దసపల్లా భూములు చంద్రబాబు వర్గం, ఇప్పుడు వీళ్ళకు క్యాష్. మనం కూడా రాష్ట్రంలో సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకుని రానున్నాం. వచ్చే రోజుల్లో వాటర్ నుంచి హైడ్రోజన్‌ను తయారు చేస్తాం. విదేశాలకు విద్యుత్ అమ్ముతాం. ఇది మా విజన్ అన్నారు సోము వీర్రాజు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!