Komatireddy Venkat Reddy Inspected AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజనలు వివాదం కూడా పెద్దగా ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త భవనం కోసం మార్చి లోగా…
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఏపీ భవన్ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ విజ్ఞప్తికి పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేయడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులతో పలుమార్లు సమావేశమైన కేంద్ర హోం శాఖ.. వాటికి సంబంధించిన మినిట్స్‌ను విడుదల చేసింది.
AP-Telangana Bhavan in Delhi: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులను కోరారు. దీనికి ప్రతిఫలంగా పటౌడీ హౌస్‌లో ఏడెకరాల భూమిని ఇవ్వాలని ప్రతిపాదించారు. అక్కడ కొత్త భవనం నిర్మించాలని సూచించారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి,…