AP Assembly: గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తొలిరోజే మూడు రాజధానులపై స్వల్పకాలికంగా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల రెఫరెండం అంశంతోనే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని ప్రజల్లోకి సమగ్రంగా తీసుకుని వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమరావతి…
పెగాసెస్ పై అసెంబ్లీ హౌస్ కమిటీ తొలి సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చట్ట విరుద్ధంగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చిలో హౌస్ కమిటీ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం అయింది హౌస్ కమిటీ. రేపు హోం తదితర శాఖల అధికారులతో సమావేశం కానుంది హౌస్ కమిటీ. టీడీపీ హయాంలో పెగాసెస్ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని,…