సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'మేమ్ ఫేమస్'. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమా ఓ వారం ముందే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు.
'రైటర్ పద్మభూషణ్' తర్వాత అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన 'మేమ్ ఫేమస్' మూవీ జూన్ 2న విడుదల కాబోతోంది. మొత్తం తొమ్మిది పాటలున్నా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఈ నెల 14న రిలీజ్ అవుతోంది.
'రైటర్ పద్మభూషణ్' చిత్ర బృందాన్ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభినందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.